Friday, December 20, 2024

కుటుంబాలకే ప్రతిపక్షాలు పరిమితం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

పోర్ట్ బ్లెయిర్: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. కుటుంబ పాలన, అవినీతిపైనే ప్రతిపక్షాల దృష్టంతా అంటూ ఆయన మండిపడ్డారు. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన నూతన టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గద్దె దించడమే లక్షంగా బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. పోర్ట్ బ్లెయిర్‌లో విమానాశ్రయాన్ని సందర్శించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News