Friday, November 15, 2024

విపక్ష నేతలకు మానవత్వం లేదు

- Advertisement -
- Advertisement -

మూసీలో పారేది విషపు నీళ్లు.. శుద్ధి చేయాలన్న
మా ప్రభుత్వ నిర్ణయం గొప్పది ప్రక్షాళనపై
ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా? మూసీ
డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది
బిఆర్‌ఎస్సే : మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరాబాద్ : మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉ ద్యమం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంత్రుల క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ మూసీని శుద్ధి చేయడానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్షాలకు మానవత్వం లేదని ఆయన మండిపడ్డారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులకు మానవత్వం లేదని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని ఆయన తెలిపారు. పది సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆయనఆరోపించారు. మూ సీలో పారేది విషపు నీళ్లని, తెలంగాణ వచ్చాకమూసీ స్థితి మారుతుందని అనుకున్నామని, కానీ, బిఆర్‌ఎస్ కోట్లను దోచుకుందని మంత్రి దుయ్యబట్టారు.

మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి, మూసీని శుద్ధిచేయడమే తమ ప్రధాన ఉద్ధేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే తాము ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువని, మూసీలో పారేది విషపు నీళ్లని తెలిసి కూడా దానిని అడ్డుకోకుండా ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఆయన ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు ప్ర భు త్వం చర్యలు తీసుకుంటుంటే, ఎందుకు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి ్డ ప్రశ్నించారు.

కెసిఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు

కెసిఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలన్నారు. కెసిఆర్, కెటిఆర్‌లు మా ఊరిలో బస చే యాలని, మా ఊరిలో కనీసం వారు టిఫిన్ కూడా చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ‘మాయమై పోతున్నాడమ్మా మనిషిన్నవాడు’ అనే పాటను గుర్తు చేశారు. మీరు మనుషులేనా? కనీసం మానవత్వం లేదా? మూసీ డెవలప్‌మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది? లక్షల కోట్లు సంపాదించావు, పేదలపై కొంచెం కూడా జాలి లేదా? కాళేశ్వరం ఒక తు గ్లక్ పని, మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం, మూసీ పరిస్థితి ఎలా ఉందో కెసిఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్ట లేదా? పదేండ్లు అధికారంలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో అలా ఓడిపోవడానికి సిగ్గు లేదా? అంటూ మంత్రి కోమటిరెడ్డి బిఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.

నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నా

మూసీవల్ల కలిగే ఇబ్బంది తెలిస్తే జర్నలిస్టులు కూడా సహించరన్నారు. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలన్నారు. తాము మూసీ మురికితో చావాలా అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. హరీశ్ రావో, అగ్గిపెట్టే రావో వెళ్లి మూసీ దగ్గర ఉంటే రోగాలు వస్తాయని చెప్పాలని ఆయన సూచించారు. ఎంత ఖర్చయినా పెట్టి మూసీని ప్రక్షాళన చేయాలని సిఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. డిపిఆర్ రెడీ కాకుండా అవినీతి ఎక్కడ అవుతుంది? కెటిఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. మూసీకంపు బిఆర్‌ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. మూసీ కలుషిత నీటితో పండించిన పంటలు తిన్నా అనారోగ్యమేనని, ఎంత ఖర్చు అయినా మూసీ నరకం నుంచి తమ జిల్లా ప్రజలను బయటపడేయాలని మంత్రి కోరారు. నల్గొండ జిల్లా అంటే కెసిఆర్‌కు కక్ష అని ఆయన అన్నారు.

ఫార్మా ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్ మూసీలో కలుస్తాయి

హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ నల్గొండ జిల్లాలో ఉండే కృష్ణానదిలో కలుస్తున్నాయని, అదంతా కలుషితమైన నీరేనని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.1,000 కోట్లు అప్పు చేసిందని, దానిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కొనుగోలు చేసి చైర్మన్‌ను చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మూసీ నదిని శుద్ధిచేసి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటితో నింపుతామని, నల్గొండ ప్రజలకు ఇకపై స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అమెరికాలో చదువుకున్న కెటిఆర్‌కు అసలు కామన్ సెన్స్ లేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మూసీపై ఏమైనా అనుమానాలుం టే కెటిఆర్, హరీష్ రావులు రీసెర్చ్ చేసుకోవాలని మం త్రి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చి ఆ కంపుతో రోగాల బారిన పడుతున్న ప్రజల్ని చూశాక ప్రక్షాళనపై మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరు? :మంత్రి శ్రీధర్‌బాబు

గత ప్రభుత్వ హయాంలో 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? అని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారాస చేసిన పనులను ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆర్భాటంగా ప్రకటించి కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను కూడా నియమించారని గుర్తు చేశారు. 2018లో మూసీ నదికి సంబంధించిన ప్రాజెక్టును ఏవిధంగా చేపట్టాలనే దానిపై సమావేశం నిర్వహించారు. రివర్ బెడ్‌లో ఆక్రమణల లెక్కలు తీయాలని చెప్పారు. మూసీనదికి బౌండరీతో పాటు బఫర్ జోన్ ఫిక్స్ చేయాలన్నారు. మూసీకి ఇరు వైపులా 50 మీటర్లను బఫర్ జోన్‌గా గుర్తించాలని జీవో జారీ చేశారు. కాలుష్యం తీవ్రంగా ఉందని, కాలుష్య రహితంగా చేస్తామని చెప్పారు.

రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళిక కూడా రూపొందించారని, మూసీనది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని 2021లోనే కేటీఆర్ ఆదేశించారు. మూసీ నిర్వాసితులకు పరిహారంపై కూడా కేటీఆర్ చర్చించారు. ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించాలనే ఆలోచన చేశారని మేం కూడా అనుకున్నాం. కానీ, పేపర్లకే పరిమితమై మాటలతోనే కాలం గడిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రక్రియ చాలా క్లిష్టమైంది.

సమస్యలను భారాస నేతలు ఇంకా జఠిలం చేస్తున్నారని, అందరికీ ఉపయోగపడే పనులపై భారాస నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అందరితో చర్చించి ముందుకెళ్తుంటే తమ మీద బురద జల్లుతున్నారని, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారో మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ఇవ్వకుండానే బలవంతంగా వెళ్లగొట్టారని, మూసీ నిర్వాసితులకు మరో చోట ఆవాసం కల్పిస్తున్నామన్నారు. ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని, దీంతో మూసీ పరిధిలో చాలా మంది స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేస్తున్నారని శ్రీధర్‌బాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News