Friday, November 22, 2024

రాష్ట్రపతిజీ.. ప్రధానిని మాట్లాడించండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా నాయకుల బృందం బుధవారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కలిసి, మణిపూర్ విషయంపై మెమొరాండం సమర్పించింది. మణిపూర్‌లో వెంటనే శాంతి స్థాపన జరగాల్సి ఉంది. ప్రధాని మోడీ మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో మాట్లాడేలాగా ఆదేశించాలని ఇండియా బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. నెలల తరబడి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధాని తగు విధంగా స్పందించడం లేదు. ప్రధాని వెంటనే ఘర్షణల రాష్ట్రంలో పర్యటించి, తెగల మధ్య సామరస్యానికి పాటుపడాల్సి ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాలు తమ విజ్ఞప్తి పత్రంలో హర్యానాలోని నూహ్‌లో ఉద్రిక్తతను కూడా ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎంఒకు) కేవలం వందకిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో పరిణామాలపై ఇప్పటివరకూ కేంద్రం సరైన రీతిలో వ్యవహరించడం లేదని ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రపతికి మెమొరాండం తరువాత మీడియాతో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఇతర నేతలతో కలిసి మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన ఎంపిల బృందం రాష్ట్రపతికి పరిస్థితిని తెలిపిందని, ఇటీవల మణిపూర్ పర్యటనకు వెళ్లివచ్చిన బృందం కూడా రాష్ట్రపతికి అక్కడి వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించిందని తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో తిరుచి శివ, కనిమొళి, రాజీవ్ లల్లన్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, సుశీల్‌కుమార్ గుప్తా, మనోజ్ ఝా ఇతరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News