Sunday, January 19, 2025

ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

పాట్నా: పాట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేయడం గురించి మాత్రమే చర్చించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెప్పారు. పాట్నా సమావేశంలో పాల్గొన్న అనంతరం చెన్నైకి తిరిగి వచ్చిన స్టాలిన్ విలేఖరులతో మాట్లాడుతూ… తాను ఏడు సూచనలు చేశానని చెప్పారు.

రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ నేతృత్వంలో కూటమిని ఏర్పాటు చేయడం, అది సాధ్యం కాని పక్షంలో సీట్ల పంపిణీని పరిశీలించాలనేది వాటిలో ఒకటని ఆయన చెప్పారు. కాగా నితీశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రీవాల్, ఎంకె స్టాలిన్, హేమంత్ సోరేన్, అఖిలేశ్ యాదవ్,తేజస్వి యాదవ్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, ఒమర్ అబ్దులా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News