Wednesday, January 22, 2025

కాంగ్రెస్ ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించకుంటే భవిష్యత్తు భేటీల్లో పాల్గొనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాట్నాలో సమావేశమైన తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో తామంతా ఒక్కటిగా ఉన్నామని చెప్పడానికి 16 పార్టీల నేతలు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ సమావేశానికి హాజరైన ఆమ్‌ఆద్మీ పార్టీ మరో సారి బాంబు పేల్చింది. ఢిల్లీలో అధికారుల సర్వీసులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా వ్యతిరేకించని పక్షంలో భవిష్యత్తులో జరిగే విపక్షాల సమావేశాలకు తాము హాజరు కాబోమని స్పష్టం చేసింది. ‘ఇంత ముఖ్యమైన అంశం విషయంలో టీమ్ ప్లేయర్‌గా నడుచుకోవడానికి

కాంగ్రెస్ ముందుకు రాక పోవడంతో కాంగ్రెస్‌తో కూడిన ఏ కూటమిలోను ఆప్ భాగస్వామి కావడం కష్టంగా మారుతోంది. రాజ్యసభలోని తమ మొత్తం 31 మంది రాజ్యసభ ఎంపిలు ఈ నల్ల ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తారని కాంగ్రెస్ ప్రకటిస్తే తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ పాలు పంచుకునే ఏ భావ సారూప్య పార్టీల సమావేశంలోను ఆప్ పాల్గొనడం కష్టమవుతుంది’ అని శుక్రవారం ఆ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాము ఢిల్లీ ప్రజలతో ఉన్నామో లేక మోడీ ప్రభుత్వంతో ఉన్నామో కాంగ్రెస్ నిర్ణయించుకోవలసిన అవసరం ఉందని కూడా ఆప్ ఆ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News