Monday, January 20, 2025

మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం: ప్రతిపక్షాల నిర్ణయం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఉన్నత వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

మరికొద్దిసేపట్లోనే ఇందుకు సంబంధించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్షాలు నోటీసు అందచేయనున్నట్లు వారు చెప్పారు. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చిటన్లు వారు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఉదయం తన చాంబ ర్‌లో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్ ఉభయ సభలలో అనుసరించవలసిన వ్యూహాన్ని ప్రతిపక్ష నేతలు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా..మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నంలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన చాంబర్‌లో సమావేశం అయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News