Tuesday, November 5, 2024

బెంగళూరులో జులై 17, 18న ప్రతిపక్షాల మలివిడత సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయడంపై చర్చించేందుకు జులై 17, 18 తేదీలలో బెంళూరులో రెండవ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. బిజెపి వాషింగ్ మిషన్‌కు చెందిన ముంబై ఆపరేషన్స్‌తో బిజెపిని ఓడించాలన్న తమ సంకల్పం మరింత బలోపేతం అయినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ప్రతిపక్ష నాయకుల తదుపరి సమావేశం తేదీలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సమోవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫాసిస్టు, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే తమ కృతనిశ్చయమని ఆయన తెలిపారు. పాట్నాలో అఖిల ప్రతిపక్ష సమావేశం విజయవంతమైనంత తర్వాత రెండవ సమావేశం బెంగళూరులో జులై 17, 18 తేదీలలో జరుగుతుందని ఆయన చెప్పారు.

కాగా..మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఎన్‌సిపి నాయకుడు, అజిత్ పవార్, మరో 8 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బిజెపిని ఘాటుగా విమర్శించారు. ముంబైలో ఐస్(ఇన్‌కంట్యాక్స్, సిబిఐ, ఇడి) డిటెర్జెంట్‌తో బిజెపి వాషింగ్ మిషన్‌పని చేయడం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News