Wednesday, January 22, 2025

కనీసం 450 లోక్ సభ స్థానాల్లో బిజెపితో విపక్షాల నువ్వా, నేనా పోటీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఓడించాలంటే ద్విముఖ పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. లోక్‌సభ 450 స్థానాలకు ఈ ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలని విపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. బిజెపి ఓట్లు చీలకుండా ఉండాలనే లక్షంతోనే ఈ వ్యూహాన్ని ప్రతిపక్షాలు అమలుచేయాలనుకుంటున్నాయి. ఇందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘వన్ టు వన్ ఫార్మూలా’ను ప్రతిపాదించారని తెలిసింది. బిజెపిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 23న బీహార్‌లోని పాట్నాలో సమావేశం కానున్నాయి.

బీహార్‌లోని పాట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరవ్వనున్నారు. వీరేకాకుండా అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే తదితరులు హాజరుకానున్నారు. కాగా వామపక్ష నాయకులు డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్ కూడా ఈ ప్రతిపక్ష నేతల సమావేశానికి హాజరుకానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News