Sunday, December 22, 2024

పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకులను లక్షంగా చేసుకోవడానికి కేద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో మకర దవారానికి దారితీసే మెట్టపైన నిలబడి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, టిఎంసి, ఆప్‌తోసహా ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు.

ప్రతిపక్షం నోరు మూయించడానికి దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని నిలిపివేయాలి, బిజెపిలో చేరి అవినీతికి లైసెన్సు తెచుకోండి అన్న నినాదాలు గల ప్లకార్డులను వారు ప్రదర్శించారు. జైలులో నిలబడి ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోటోలతో కూడిన పోస్టర్లను ఆప్ ఎంపీలు కొందరు ప్రదర్శించారు.

ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను జులై 12 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు జూన్ 29న ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు ఈ నిరసన చేయడం గమనార్హం. మనీ లాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేయడంతో బిర్సా ముండా జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గత శుక్రవారం విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News