Sunday, September 8, 2024

రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నాయకుల వాకౌట్

- Advertisement -
- Advertisement -

ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న ధన్కర్

న్యూఢిల్లీ:  ఆర్థిక మంత్రి నిన్న వివక్షపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని నిరసన తెలుపుతూ ప్రతిపక్షనాయకులు నేడు(బుధవారం) రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

తాను రైతు నాయకులను ఆహ్వానించినప్పటికీ వారిని పార్లమెంటు ప్రాంగణంలోకి అనుమతించలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. ‘‘ వారు రైతులు కనుకే వారిని అనుమతించి ఉండకపోవచ్చు. మేమే ఇక వారిని వెళ్లి కలుస్తాము’’ అన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘ బడ్జెట్ కొందిరికే సంతోషాన్ని కలిగించింది. ఇద్దరికి తప్పించి మిగతా వారందరికీ శూన్య హస్తం చూపింది’’ అన్నారు.

రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాక ‘‘ వారి ప్రవర్తన సరిగా లేదు. అంతరాయాన్ని రాజకీయ వ్యూహంగా, ఆయుధంగా మలచుకుంటున్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడగలదు’’ అన్నారు. ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బడ్జెట్ లో తమిళనాడును నిర్లక్ష్యం చేసినందుకు జులై 27న జరుగనున్న ‘నీతి ఆయోగ్ సమావేశం’ ను బహిష్కరించనున్నానని ప్రకటించారు. తమిళనాడుతో పాటు కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించనున్నాయి. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘ కేంద్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకంగా, రాజకీయ ఏకపక్షంగా ఉంది’’ అని విమర్శించారు. ప్రజల సంక్షేమానికి కాక కేవలం ఎన్ డిఏ మిత్రపక్షాలను సంతుష్ట పరిచేలా బడ్జెట్ ఉందని కూడా ఆమె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News