Monday, January 13, 2025

ప్రతిపక్షాల బాయ్ కాట్ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు!?

- Advertisement -
- Advertisement -

ముంబై: కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం తర్వాత శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు ఆరంభమయ్యాయి. కాగా స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనున్నది. కాగా ప్రతిపక్షాలు బిజెపి ఎంఎల్ఏ చిన్సుఖ్ సంకేతి ప్రమాణస్వీకారం తర్వాత తొలిరోజు కార్యక్రమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవిఎం) అవకతవకలపై నిరసనగా కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) ఎమ్మెల్యేలు తొలి రోజు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ఉప ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్ ప్రమాణస్వీకారం తర్వాత, సకోలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను ప్రమాణస్వీకారానికి పిలిచారు, కానీ ఆయన నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహానికి నివాళులు అర్పించేందుకుగాను విపక్ష సభ్యులు ఆ తర్వాత బయట పోగయ్యారు.

రాష్ట్ర అసెంబ్లీలో శివసేన (యుబిటి)కి నాయకత్వం వహిస్తున్న భాస్కర్ జాదవ్ తమ వైఖరిని స్పష్టం చేశారు: “ఎంఎల్ఏలుగా గోప్యత ప్రమాణ స్వీకారానికి మేము వ్యతిరేకం కానప్పటికీ, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము. మహాయుతి సంకీర్ణానికి అపూర్వమైన మద్దతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ప్రజల అభీష్టం ప్రకారం కాకుండా, ఈవీఎంల వినియోగానికి అనుగుణంగా వ్యవహరించారు.  వారు కోరుకున్నట్టే ఎన్నికలు ఈవిఎంలతో జరిపించారని అందరికీ తెలుసు, దీనికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము’’.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News