Wednesday, January 22, 2025

ఇడి, సిబిఐ దుర్వినియోగం సుప్రీంను ఆశ్రయించిన విపక్ష పార్టీలు..

- Advertisement -
- Advertisement -

ఇడి, సిబిఐ దుర్వినియోగం
గిట్టనివారిపై వేధింపులకు వాడుకుంటున్నారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సహా 14 విపక్ష పార్టీలు
ఏప్రిల్ 5న విచారణకు సుప్రీం అంగీకారం

న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఉసిగొల్పుతోందని, తద్వారా రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును విపక్షాలు ఆశ్రయించాయి. దీనిపై ఏప్రిల్ 5న విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రతిపక్ష నేతలపై ఇడి, సిబిఐ తప్పుడు కేసులు పెడుతోందని పేర్కొంటూ 14 విపక్ష పార్టీలు శుక్రవారంనాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విపక్షాలు ఈ పిటిషన్‌ను మెన్షన్ చేశాయి. ఇడికి అపరిమిత అధికారాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అరెస్టుకు ముందు, తర్వాత మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాయి. సుప్రీంను ఆశ్రయించిన వారిలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, డిఎంకె, టిఎంసి, ఆప్, ఎన్‌సిపి, శివసేన, జెఎంఎఎం, జెడి(యు), సిపిఐ, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా తమతో ఏకీభవించని వారిని లక్షంగా చేసుకుని సిబిఐ, ఇడి, ఐటి తదితర సంస్థలను పంపిస్తున్నారని పార్టీలు ఆరోపించాయి. తద్వారా కీలకమైన ప్రాథమిక హక్కులకు కేంద్రం పాతరేస్తోందని పిటిషనల్ పేర్కొన్నాయి. మనీలాండరింగ్ చట్టం కింద ఇప్పటి వరకు 23 మందిని మాత్రమే దోషులుగా తేల్చారని గుర్తు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News