- Advertisement -
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. రైతుల పండించిన వరి పంటను కొనాలని పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు గళమెత్తారు. నాలుగో రోజు పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు నోరు మెదపడంలేదు. పెరుగుతున్న ధరలు, పెగాసస్ కుంభకోణం లాంటి రైతులు, ప్రజల సమస్యలను ప్రశ్నించినందుకు 12 మంది ఎంపిలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -