- Advertisement -
పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 12న భారీ ఎత్తున ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనున్నది. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలపై ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. 18కి పైగా ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యనేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది.
అయితే ఇది సన్నాహక సమావేశం మాత్రమేనని, ప్రధాన సమావేశం తరువాత జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక నేత చెప్పారు. ఆదివారం నాడు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని దాదాపు 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఇదే స్ఫూర్తితో విపక్షాలు ఒకే బాటపై నడిచేలా ఐక్యత సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.
- Advertisement -