Thursday, January 23, 2025

విపక్ష పార్టీలతో కలిసి టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Opposition protest in Mahatma Gandhi statue in Parliament

హైదరాబాద్: రాజ్య సభ రెండు గంటల వరకు వాయిదా పడింది. నిత్యావసరాల వస్తువులతో పాటు పాలు, పాల పదార్థాల రేట్ల పెంపుపై విపక్ష పార్టీల ఎంపిలు ఉభయ సభలలో నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. గ్యాస్ ధరల పెంపుపై విపక్ష పార్టీల ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలతో కలిసి టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టాయి. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.

జిఎస్‌టి పెంపు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జిఎస్‌టి ట్యాక్సీలతో పేదల జేబులు ఖాళీ అవుతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పాలతో పాటు నిత్యావసర వస్తువులు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దోఖేబాజ్ మోడీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్లు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వాల మోసాలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News