Friday, December 20, 2024

హోషియార్ ..లోక్‌సభ ముందస్తు ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశంలో లోక్‌సభ ఎన్నికలు నిర్ణీతం కన్నా ముందుగానే జరిగే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తెలిపారు. ఇవి ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని తోటి విపక్షపార్టీలకు ఈ జెడియు నేత పిలుపు నిచ్చారు. ముంబైలో ఇండియా కూటమి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం నితీశ్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు ముందు జరిగినా, సకాలంలో జరిగినా ఓడేది బిజెపినే అని విశ్వాసం వ్యక్తం చేశారు. సంఘటిత ప్రతిపక్షం బిజెపిని దెబ్బతీస్తుందని తెలిపారు.

ఇప్పుడు రాజకీయ సమీకరణలు వేగవంతం అయ్యాయి. ప్రతిపక్షాలు సంఘటితంగా వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఈ వేగాన్ని చూసి తట్టుకోలేక మోడీ సర్కారు మందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ఉందని ఇప్పటి పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని నితీశ్ తెలిపారు. మనం జాగ్రత్తగా ఉండటం అత్యవసరం అన్నారు. బిజెపి చరిత్రను మార్చేయాలని చూస్తోందని, ఇదే వారి లక్షం అని , ఇక విపక్షం దేశం బలోపేతానికి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు దేనిని ఎంచుకుంటారనేది సుస్పష్టంచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News