Monday, December 23, 2024

‘ఉగ్ర’ సింహాలపై ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

మనోహరం, స్థిరచిత్తానికి ప్రతిరూపం అశోకుడి సింహాలు
మోడీ ఆవిష్కరించిన విగ్రహంలో ఉగ్రంగా, భీకరంగా
సింహాలు జాతీయ చిహ్నాన్ని అవమానించారంటూ
ప్రధానిపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు
కమలనాథులు సృష్టిస్తున్న నవభారతమని ఎద్దేవా

న్యూఢిల్లీ: మన దేశ జాతీయ చిహ్నాన్ని కేంద్ర ప్రభుత్వం వక్రీకరించిందంటూ ప్రతిపక్ష నాయకులు, సామాజికవేత్తలు మండిపడ్డారు. జాతీయ చిహ్నంలోని అశోక సింహాలు మనోహరంగా, స్థిరచిత్తంగా, వివేకానికి ప్రతీకగా ఉంటాయని కాని వాటిని ఉగ్రంగా, భీకరంగా, భయోత్పాతాన్ని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని వారు ఆరోపించారు. ఈ తప్పును వెంటనే సరిదిద్ది జాతీయ చిహ్నం గౌరవాన్ని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రధా ని నరేంద్ర మోడీ సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ సమక్షంలో దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనంపైన జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిమలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించకుండా మోడీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారం టూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

ప్రధాని మోడీ ఆవిష్కరించిన సింహ ప్రతిమలపై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ట్విటర్ వేదికగా స్పం దిస్తూ&తాను ఆవిష్కరించిన సింహం ప్రతిమ సారనాథ్‌లో ని అశోక స్థూపంలో ఉన్న సింహాన్ని పోలి ఉందా లేక గిర్ అడవుల్లోని సింహంలాగా ఉందా ప్రధాని మోడీ జాగ్రత్తగా గమనించాలని సూచించారు. వెంటనే అవసరమైన మార్పు లు చేయాలని ఆయన మోడీని కోరారు. గంభీరంగా ఉండే అశోక సింహాల స్థా నంలో భీకరంగా, ఉగ్రరూపంతో ఉన్న సింహాల ప్రతిమలను ఆవిష్కరించి ప్రధాని మన జాతీయ చిహ్నాన్ని అవమానించారని, వెంటనే వా టిని మార్చాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జవహర్ స ర్కార్ కోరారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా ఇదే అ భిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంతంగా భీకరంగా, ఉగ్రరూపంతో ఉన్న సింహాల ప్రతిమలను ఆవిష్కరించి ప్రధాని మన జాతీయ చిహ్నాన్ని అవమానించారని, వెంటనే వాటిని మార్చాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జవహర్ సర్కార్ కోరారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంతంగా, గంభీరంగా ఉండే సింహాల స్థానంలో ఉగ్ర సింహాలు మన జాతీయ చిహ్నంలో చేరాయని, ఇది మన మోడీ సృష్టిస్తున్న నవ భారతమని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

సారనాథ్ శిల్పానికి ప్రతి రూపం అది

శిల్పం రూపకర్త సునీల్ డియోర్ స్పష్టీకరణ

ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంపై అశోక చక్రం, నాలుగు సింహాలతో కూడిన భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే అసలు అశోక స్థూపానికి దీనికీ ఎక్కడా పోలిక లేదని, చిహ్నంపై ఉన్న సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నాయని, ఇలాంటి దాన్ని అవిష్కరించడం ద్వారా జాతీయ చిహ్నాన్ని అవమాన పరిచారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం జాతీయచిహ్నాన్ని అవమానించిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ శిల్పాన్ని రూపొందించడంలో తనపై ఎవరి ప్రభావం లేదని ఈ శిల్పాన్ని రూపొందించిన శిలి సునీల్ డియోర్‌మంగళవారం చెప్పారు. సారనాథ్‌లోని స్థూపానికి ఇది ప్రతి రూపమని, ఒరిజినల్ శిల్పాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును తాము ప్రారంభించామని ఆయన తెలిపారు.

శిల్పాన్ని రూపొందించేటప్పుడు అసలు శిల్పం దామాషాలను దృష్టిలో పెట్టుకున్నామని కూడా ఆయన చెప్పారు. అయితే అసలు శిల్పం 3నుంచి 3.5 మీటర్ల ఎత్తు మాత్రమే ఉందని, కొత్తది 21.3 మీటర్ల ఎత్తు ఉందని ఆయన చెప్పారు.అందువల్ల వేర్వేరు కోణాల్లో సింహాల ముఖ కవళికల్లో తేడాకనిపిస్తుందని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన ఫోటోలు శిల్పం కిందినుంచి తీసినవని, అందుకే సింహం ముఖ కవళికల్లో తేడాలు కనిపిస్తున్నాయని, నోరు పెద్దగా కనిపిస్తోందని ఆయన వివరించారు. అంతేకాదు, ప్రభుత్వంనుంచి తనకు నేరుగా కాంట్రాక్ట్ అందలేదని, టాటా ప్రాజెక్ట్ లెమిటెడ్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చిందని కూడా శిల్పి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News