Sunday, December 22, 2024

సభకు రానప్పుడు కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విభజన సమయంలో అధిక విద్యుత్‌ను మన రాష్ట్రానికి యుపిఎ ప్రభుత్వం కేటాయించిందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్‌ను కేటాయించాలన్నారు. విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నామని, కెసిఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే కెసిఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదనడం సరికాదన్నారు. సభకు రానప్పుడు కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కెసిఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చుకదా? అని రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News