Sunday, June 30, 2024

‘నీట్’ పై ఉభయ సభలలో వాయిదా తీర్మానం పెట్టనున్న విపక్షం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలలో శుక్రవారం ‘నీట్’ రగడపై  ప్రతిపక్ష ఇండియా కూటమి వాయిదా తీర్మానం పెట్టనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిపక్షం నీట్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సిబిఐ, ఈడిల దుర్వినియోగం, గవర్నరు కార్యాలయం దుర్వినియోగం వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై జరిగే చర్చలో లేవనెత్త నుంది. కాగా ప్రతిపక్షం సభ్యులు సోమవారం పార్లమెంటు కాంప్లెక్స్ లోని గాంధీ విగ్రహం వద్ద సమావేశం కానున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News