2 శాతం ఓట్లు, 5.82లక్షల ఓట్ల తేడాతో 26 సీట్లు కోల్పోయిన బిఆర్‌ఎస్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలు, సెటిలర్లు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆలోచన సరళిలో మార్పు
మిట్టపల్లి శ్రీనివాసు / హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో అంత తీవ్ర వ్యతిరేకత లేన ట్లు గా ఓట్ల సరళి వెల్లడిస్తోంది. కేవలం రెండు శాతం ఓట్లు, ఐదు లక్షల 82 వేల ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రం లో26 సీట్లను కోల్పోయి హ్యాట్రిక్‌ను చేజార్చుకుంది. 2018 ఎన్నికల ఫలితాల ఓట్లను, ప్రస్తుతం నమోదైన ఇసి రికార్డుల్లోని ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 19 శా తం ఓట్లతో అప్పట్లో (2018) ఓడిపోతే, ఇప్పుడు బిఆర్ ఎస్ రెండు శాతం ఓట్లతోనే అధికారానికి దూరమైంది. ప్రస్తుతం అసెంబ్లీలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి సిపి ఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పొందిన ఓట్లతో కలిపితే 93 లక్షల ఓట్లు వచ్చాయి. ఓటమి పాలైన బిఆర్‌ఎస్ పార్టీకి 87 లక్షల 53, 000 ఓట్లు వచ్చాయి. అంటే స్వల్పంగా 5 లక్షల 83 వేల ఓట్ల తే డాతోనే బిఆర్‌ఎస్ ఓటమి పాలైంది.
ప్రజల్లో బిఆర్‌ఎస్ పార్టీ అంటే తీవ్ర వ్యతిరేకత లేదని ఈ ఓట్ల సర ళి స్పష్టం చేస్తున్నది. 2018 ఎన్ని కలతో పోలిస్తే ప్రస్తుతం 64 లక్షల ఓటర్లు పెరిగారు. అప్పట్లో రెండు కోట్ల 56 లక్షల ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 3కోట్ల 20 లక్షలకు పెరి గింది. పెరిగిన 64 లక్ష ల ఓట్లలోమెజా రిటీ గా కాంగ్రెస్ పార్టీ 35 లక్షల ఓట్లను సాధిం చుకొన్నది. మూడో స్థానంలో నిలిచిన బిజెపి త్రిముఖ పోటీలో భారీగా లాభపడినట్లు ఓట్ల సరళి సూచిస్తున్నది. 2018లో బిజెపి 7.1 శాతంతో 14 లక్షల 50 వేల ఓట్లు సాధిం చగా, ఈసారి ఆ ఓట్ల బలం 32 లక్షల 50 వేలకు పెరిగింది. అంటే 14% ఓట్లతో సీట్ల సంఖ్య ఒకటి నుంచి ఎనిమిదికి పెరిగింది. ఈ మేరకు త్రిముఖ పోటీలో బిజెపి భారీగా బలపడినట్లుగా కనిపిస్తున్నది. ఐదు లక్షల ఓట్ల తేడాను పొం దిన బిఆర్‌ఎస్ 2018లో 97 లక్షల ఓట్లను, ప్ర స్తుత ఎన్నికల్లో 10 లక్షలు తక్కువగా 87 లక్షల 50 వేల ఓట్లను పొందింది. మొ త్తంగా 2018లో కాంగ్రెస్ కు ఉన్నంత తీవ్ర వ్యతిరేకత బిఆర్‌ఎస్‌కు ప్ర స్తుతం కనిపించలేదు. మైనారిటీలు, సెటిలర్లు ఉద్యోగులు, నిరుద్యోగులు ఏకపక్షంగా బిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించ లేదు . ఇది ప్రాంతాల వారీగా ఓటర్ల ఆలోచన సరళిలో మార్పును తెలియజేస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆ నా లుగు వర్గాల వారు బిఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఓటర్లు బిఆర్‌ఎస్ కు పూర్తిగా మద్దతు తెలిపారు. పాత రంగారెడ్డి, హైదరా బాద్ జిల్లాలో 39 సీట్లు ఉంటే ఇందులో 17 సీట్లను టిఆర్‌ఎస్ గెలువ గలిగింది. సెటిలర్లు, మైనారిటీలు భారీ సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి, మహే శ్వరం, ఎల్‌బినగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి లాంటి నియో జకవర్గాల్లో మైనారిటీలు, సెటిలర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఏకపక్షంగా బిఆర్‌ఎస్‌కు జై కొట్టారు. హైదరాబాద్‌లో సగం మంది కూడా ఓట్లు వేయకున్నా వేసిన వారంతా బిఆర్‌ఎస్‌కు ఓటు వేయడం ఇక్కడ విశేషం. ఐటి ఉద్యోగులు భారీ సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో బిఆర్‌ఎస్ భారీ మెజారిటీని నమోదు చేసుకొన్నది.
హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం ఓటర్ల తీర్పులో హైదరాబాద్, రంగారెడ్డి ఓటర్ల తీర్పు మునుపెన్నడూ లేనంత అనూ హ్యంగా మారడం చెప్పుకోదగిన విషయం. తెలంగాణలో మిగిలిన 8 జిల్లాల్లో మా త్రం బిఆర్‌ఎస్ ఒకే రీతిగా కాస్త అటుఇటుగా దెబ్బతిన్నది. అంటే ఇక్కడ ఆ నాలుగు వర్గాల వారు బిఆర్‌ఎస్‌ను వన్‌సైడ్‌గా వ్యతిరేకించారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఖమ్మం జిల్లా కూడా కాంగ్రెస్ ఏక పక్షంగా గెలవగలి గింది. ఫలితంగా మొత్తంగా ఇలాంటి పరిణామాలతో బిఆర్‌ఎస్ 39 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది.