హైదరాబాద్: ప్రతిపక్షాలు సోమవారం మోడీ ప్రభుత్వం తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎల్‌ఐసి, ఎస్‌బిఐ కార్యాలయాల ఎదుట ఈ నిరసనలు చేపట్టారు. పార్లమెంటు వద్ద ప్రతిపక్ష నాయకులు గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని దర్యాప్తు జరపాలని, పార్లమెంటులో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ వాయిదా పడ్డాయి. విపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేయడంతో ఉభయ సభలలో కార్యక్రమాలు కొనసాగలేదు. ఢిల్లీలో ఎన్‌ఎస్‌యూఐ నిరసనలు చేపట్టింది. కర్నాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు ప్రదర్శించారు. హైదరాబాద్, ముంబయి, చెన్నైలలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దర్యాప్తుకు సమ్మతిస్తే బండారం బయటపడుతుందని ప్రభుత్వం విపక్షాల డిమాండ్‌ను ఆమోదించడం లేదు.
Telangana| Congress stages protest outside SBI office in Hyderabad over Adani row pic.twitter.com/s24b6yOKnV
— ANI (@ANI) February 6, 2023