ముంబై: ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాలు అదానీ గ్రూపు కంపెనీలపై దర్యాప్తు డిమాండ్‌పై ఒక్కత్రాటిగా ఉన్నారని ఆదివారం శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆ డిమాండ్‌కు తమ పార్టీ కూడా మద్దతునిస్తోందన్నారు. ఆయన విలేకరులతో ఈ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అదానీ కంపెనీలపై దర్యాప్తు విధివిధానంపై కాంగ్రెస్‌కు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మధ్య అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఆ విషయంలో తాను జోక్యం కల్పించుకోనని సంజయ్ రౌత్ తెలిపారు.
‘అదానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు అవసరమని ఐక్య ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. శివసేన(యుబిటి) కూడా అందులో(ప్రతిపక్షాల్లో) భాగమే’ అని ఆయన అన్నారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్తు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు ఒక్కసారే జరపొచ్చని’ అని రాజ్యసభ సభ్యుడు అయిన రౌత్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలి కానీ అవినీతికి మద్దతు ఇవ్వకూడదని రౌత్ అన్నారు.
‘పవార్ అదానీపై దర్యాప్తును వ్యతిరేకించలేదు. కానీ సమస్య అంతా జెపిసియా లేక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తా? అనేదే’ అని రౌత్ వివరించారు. ప్రతిపక్షాలపై మోడీ ప్రభుత్వం చేస్తున్న లక్షిత దాడులపై శరద్ పవార్ ఓ వైఖరి తీసుకోవాలని కూడా అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ప్రస్తుత సందర్శన గురించి అడిగినప్పుడు ‘మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను అమోమయంలో వదిలేసి, ఆ పార్టీ నాయకులు మాత్రం ఆధ్యాత్మిక పర్యటనపై వెళ్లారు’ అన్నారు. ‘ఈ ప్రభుత్వం అయోధ్య మీద రాజకీయాలు చేస్తోంది. రాముడు తప్పును వ్యతిరేకించే దేవుడు. ఆయన వీరిని ఎన్నడూ దీవించడు. దేవుడు వారికి మంచి బుద్ధి ఇస్తాడని ఆశిస్తున్నాము’ అని వివరించారు.