Sunday, January 19, 2025

ప్రతిపక్షాల ఐక్యత బిజెపిని ఓడించలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత సైద్ధాంతికంగా భిన్నం కనుక 2024లో కాషాయపార్టీని ఓడించలేవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత బిజెపిపై ప్రభావం చూపదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష ఐక్యత ఒక ముఖద్వారం మాత్రమే అని కేవలం పార్టీలు లేదా నాయకులు ఏకతాటిపైకి వల్ల బిజెపి ఓటమి సాధ్యం కాదన్నారు. బిజెపిని విపక్షాలు సవాలు చేయాలనుకుంటే కమలంపార్టీ బలాలను అర్థం చేసుకోవాలి.

హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమవాదం అనేవి మూడుస్థాయిల బిజెపి మూలస్తంభం. ప్రతిపక్షాలను కనీసం వాటిలో రెండుస్థాయిలను ఛేదించలేకపోతే బిజెపిని నిలువరించలేరని ప్రశాంత్ కిషోర్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో అన్నారు. హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే కూటమి ఉండాలి. గాంధీవాదులు, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు తరహాలో భావజాలం చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమిని పార్టీలు లేదా నాయకుల కలయిగా చూస్తున్నారు. ఎవరు ఎవరితో లంచ్ చేస్తున్నారు. ఎవరిని టీకి ఆహ్వానిస్తున్నారనేది తను భావజాలం నిర్మాణంగా చూస్తున్నాను. బిజెపిని ఓడించే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ భావజాలమే తన భావజాలమని, జన్ సూరజ్ యాత్ర గాంధీ సిద్ధాంతాన్ని ప్రయత్నం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News