Wednesday, January 1, 2025

లోక్ సభ నుంచి విపక్షాలు వాకౌట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభలో సోమవారం ‘నీట్’ రచ్చ కాక పుట్టించింది. నీట్ పై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టగా, స్పీకర్ దానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. నేడు లోక్ సభ ప్రారంభమయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకుర్ ప్రారంభించారు. సభ ప్రారంభమయ్యాక గందరగోళం చోటుచేసుకుంది.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఎన్ టిఏ వైఫల్యంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ పై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. నీట్ పై ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ను కోరారు. కాగా నీట్ అంశంపై బిఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ బిర్లా అన్నారు. నీట్ పై చర్చకు అనుమతించకపోవడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.

Opposition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News