Sunday, January 19, 2025

ఓపిఎస్ కుమారుడి లోక్‌సభ ఎన్నిక చెల్లదు: మద్రాసు హైకోర్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వమ్ కుమారుడు, ఎఐఎడిఎంకె ఎంపి ఓపి రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తేని నుంచి తెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు గురువారం ప్రకటించింది.

తన గెలుపుకోసం రవీంద్రనాథ్ అక్రమ చర్యలకు పాల్పడ్డారని, తన ఆదాయానికి సంబంధించిన వాస్తవాలను ఆయన మరుగునపరిచారని ఆరోపిస్తూ ఒక ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. అయితే తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశమిస్తూ రవీంద్రనాథ్‌కు జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ నెలరోజుల వ్యవధి ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని 39 స్థానాలలో 38 స్థానాలను డిఎంకె-కాంగ్రెస్ కూటమి గెలుచుకోగా అన్నా డిఎంకె నుంచి రవీంద్రనాథ్ ఒక్కరే గెలుపొందారు. పన్నీర్‌సెల్వం పెద్దకుమారుడైన రవీంద్రనాథ్‌కు ఈ ఎన్నికల్లో 76,672 ఓట్ల ఆధిక్యత లభించింది.

కాంగ్రెస్ అభ్యర్థి ఇవికెఎస్ ఇళంగోవన్‌పై ఆయన గెలుపొందారు.లోక్‌సభలో అన్నాడిఎంకె తరఫున ఏకైక ఎంపి అయినప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎడప్పాడి కె పళనిస్వామి చేజిక్కించుకోవడంతో తన తండ్రి పన్నీర్‌సెల్వమ్ తిరుగుబాటు చేసిన కారణంగా 2022లో పార్టీ ఆయనను బహిస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News