Monday, December 23, 2024

15న ఆప్షనల్ హాలీడే

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా 15న ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. సంత్ సేవాలాల్ 1739లో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్ గ్రామంలో జన్మించారు. సేవాలాల్ తన బోధనలతో సమాజంలో ఎంతో మార్పు తెచ్చారు. ముఖ్యంగా బంజారాల హక్కుల కోసం 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సేవాలాల్ మహరాజ్ వచ్చే జయంతి నాటికి ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News