Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో ఆరంజ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ముసురు ముంచెత్తుతోంది. దీంతో నగరంలోని హుస్సేన్ సాగర్, శివారులోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు జల కళ సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నిండు కుండలా దర్శనమిస్తోంది. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు అధికంగా వచ్చిచేరుతోంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు చేరుతుండగా దిగువకు నీటిని వదిలేస్తున్నారు అధికారులు.

హుస్సేన్ సాగర్‌కు ఇన్ ఫ్లో 1517 క్యూసెక్కుల వరద నీరు ఉండగా.. ఫుల్ ట్యాంక్ లెవెల్‌కు చేరువలో నీటి మట్టం చేరుకుంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లు.. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ఉంది. హైదరాబాద్ మహా నగరంలో శనివారమంతా ముసురు పడుతూనే ఉన్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు కూడా వాన పడుతూనే ఉన్నది. అత్యధికంగా షేక్ పేట, యూసుఫ్ గూడలో 3 సెం.మీ.లు నమోదవ్వగా.. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, కాప్రా పరిధిలో వాన కురుస్తూనే ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News