- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో గంట పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో ఎక్కడి వారు అక్కడ స్థంభించిపోయారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాకు వాతావరణ శాఖ శనివారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పల చోట్ల పిడుగులు, వడగళ్లతో వర్షం కురిసే అవకాశముందని సూచించింది.
Also Read: మే నెల నుంచి జిఎస్‌టి నిబంధనలు
40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయనున్నయాని వాతావరణ శాఖ పేర్కొంది. మేడ్చల్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగార్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -