Monday, December 23, 2024

ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ లో అతిపెద్ద హార్టికల్చర్ ఫెసిలిటీ ఆవిష్కరణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ తమ బాచుపల్లి శాఖలో, అతిపెద్ద పాలీహౌస్ సదుపాయం మరియు ఒక కొత్త ఆడిటోరియంను ఆవిష్కరించారు. హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికకు ‘లిటిల్ గ్రీన్ ఫింగర్స్’ అని పేరు పెట్టారు. ఇది గ్రేడ్ 1 నుండి 10 వరకు విద్యార్థులకు బోధించబడుతుంది. ఇందులో థియరీ, ప్రాక్టికల్ తరగతులు కుడా ఉంటాయి. ప్రతి గ్రేడ్‌లోని విద్యార్థులు ఉద్యానవనానికి సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకొనడానికి వారానికి ఒక తరగతి ఉంటుంది.

ముఖ్య అతిథి క్యాంపస్ టూర్ చేసి విద్యార్థులతో ముచ్చటిస్తూ.. “ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు, హార్టికల్చర్, రోబోటిక్స్ వంటి విశిష్టమైన అంశాలను పరిశీలించడానికి, అన్వేషించడానికి, నేర్చుకునేందుకు మంచి అవకాశం ఇక్కడ లభిస్తోంది. విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి మరియు దృఢమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. నగరంలో ఇంత పెద్ద ఎత్తున పాలీహౌస్‌ను ప్రారంభించి మొదటి పాఠశాల ఇదే, ఈ విశిష్ట ప్రయత్నానికి నా సహకారాన్ని అందించడం నాకు సంతోషంగా ఉంది.

కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. డా. ఎన్ అరుణ రావు, ప్రిన్సిపాల్, ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్, బాచుపల్లి ఇలా అన్నారు “విద్యార్థులలో పోషణ, సంరక్షణ భావాన్ని పెంపొందించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ దిశలో ఒక ముందడుగే హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికలు. మొక్కల పెరుగుదలలో ఉన్న సైన్స్ నేర్చుకోవడమే కాకుండా, పిల్లలు ఈ మొక్కలను కోయడం, వాటిని మా వర్ధమాన రైతు మార్కెట్ ద్వారా మార్కెట్‌లో విక్రయించడం కూడా నేర్చుకుంటారు. ఇది ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలతో పాటు హార్టికల్చర్ నేర్చుకోవడం వల్ల వారికి రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. మా హార్టికల్చర్ ఇనిషియేటివ్ కు పిల్లలు మరియు తల్లిదండ్రుల నుండి అపారమైన స్పందన లభిస్తోంది.”

హైదరాబాద్‌లో, NEP 2020 నిబంధనలకు కట్టుబడి, తమ పాఠ్య ప్రణాళికలలో భాగంగా ఉద్యానవనాన్ని అమలు చేసిన మొదటి పాఠశాల, ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్. బాచుపల్లి బ్రాంచ్‌లోని పాలీహౌస్ 1000 చ.అ.ల విస్తీర్ణంలో ఉంది. ప్రతి గ్రేడ్‌లోని విద్యార్థులకు, ఉద్యానవనానికి సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకోవడానికి వారానికి ఒక తరగతి ఉంటుంది. హార్టికల్చర్ సెటప్‌ను పర్యవేక్షించడం, నిర్వహించడం విద్యార్థులకు బోధించబడుతుంది. కోర్సు 10% థియరీ మరియు 90% ప్రాక్టికల్ అభ్యాసంగా విభజించబడింది. విద్యార్థులకు హార్టికల్చర్ సెటప్‌ను పర్యవేక్షించడం, నిర్వహించడం కూడా నేర్పించబడుతుంది.

పాఠ్య ప్రణాళికల అమలు కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక సైన్స్ ఉపాధ్యాయులు, సాంకేతిక ఉద్యానవనకారులతో కలిసి పనిచేసింది. విద్యార్థులు తీగలు, లతలు, పొదలు, మూలికలు, ఔషధ మొక్కలు, ట్యాప్‌రూట్‌లు, ఫైబర్స్ రూట్ మొక్కలు వంటి వృక్షసంపదను గురించి కూడా వారు తెలుసుకుంటారు. పాఠ్యప్రణాళిక ద్వారా, వారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువు తయారీ, కలుపు సంహారకాలు, పురుగుమందుల వాడకం వంటి వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News