- Advertisement -
ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నం రుషికొండ వద్ద టూరిజం ప్రాజెక్టు పేరుతో అనుమతి తీసుకున్న విస్తీర్ణం కంటే అధికంగా కొండను తవ్వేశారంటూ పిటిషన్ల దాఖలవడంతో ఎపి హై కోర్టు రుషికొండ తవ్వకాల పై కీలక ఆదేశాలు జారి చేసింది. జనవరి 31 లోగా కేంద్రం నివేదిక ఇవ్వాలని, సర్వే టీంలో ముగ్గురు ఎపి అధికారులను తొలగించాలని ఆదేశించింది. ఇది వరకు తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కమిటి ఏర్పాటు చేసినప్పటికి అందులో రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే ఐదుగురు సభ్యులతో కమిటి నియమించాలని తెలిపారు. అదే విధంగా అధికారుల వివరాలు హైకోర్టుకు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవిశాఖకు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -