Friday, February 21, 2025

జడ్జీలపై విచారణ ఉత్తర్వులు ఆందోళనకరం.. లోక్‌పాల్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హైకోర్టు జడ్జీలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరమంటూ ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం , లోక్‌పాల్ రిజిస్ట్రార్‌లకు నోటీసులు పంపింది. హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ విచారిస్తోంది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు జడ్జీలను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యం లోనే సుప్రీం కోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టి స్టే విధించింది.

అలాగే సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడ్ని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను మార్చి 18 వరకు వాయిదా వేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, లోక్‌పాల్ , లోకాయుక్త చట్టం 2013 పరిధి లోకి రారని స్పష్టం చేశారు. జనవరి 27న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వం లోని లోక్‌పాల్ తన ఉత్తర్వులో లోక్‌పాల్ చట్టం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు కూడా లోక్‌పాల్ పరిధి లోకి వస్తారని పేర్కొన్నారు. ఓ ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కేసులో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అదనపు జిల్లా న్యాయమూర్తి, మరొక హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. లోక్‌పాల్ ఆదేశాలను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. లోక్‌పాల్ వివరణ కూడా కోరింది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ధర్మాసనానికి సహకరిస్తానన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని అందువల్ల సిబాల్‌తోపాటు మరో సీనియర్ న్యాయవాది కోర్టుకు సహకరించాలని ధర్మాసనం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News