Monday, December 23, 2024

ఓయూలో పదోన్నతి పొందిన బోధకులకు ఉత్తర్వులు అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పథకం కింద పదోన్నతి పొందే బోధకుల ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ పదోన్నతి పొందిన ప్రొఫెసర్లందరికీ అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత బాధ్యతగా ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం విసి ప్రొఫెసర్ డి.రవీందర్ ప్రసంగిస్తూ దరఖాస్తులను పరిశీలించడానికి అనుసరించిన ఖచ్చిత ప్రక్రియతో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియను బహిరంగంగా నిర్వహించిన విధానాన్ని వివరించారు. మొత్తం ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయక సిబ్బంది అవిశ్రాంత ప్రయత్నాలను తిరుగులేని సహాయం అందించారని పేర్కొన్నారు. ఓయూ వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలో ఐదు సీఏఎస్ ఇంటర్వ్యూలు జరిగాయి. 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా, 9 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 14 మంది ప్రస్తుత ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News