Sunday, December 22, 2024

స్వయం సహాయ గ్రూపుల సభ్యులకు…రుణ బీమా, ప్రమాద బీమా అమలుకు ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని 64.35 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ రిస్క్ కవరేజ్‌ను (లోన్ బీమా) విస్తరించింది. ఇందుకు సంబంధించి పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలపై రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఒక్కో సభ్యురాలి రుణంపై రూ. 2 లక్షల వరకు బీమా ఉంటుంది.

లోన్ బీమా అమలుకు మొదటి సంవత్సరంలో నాలుగు విడుతల్లో ప్రభుత్వం రూ.50.41 కోట్లను విడుదల చేస్తుంది. గ్రూప్ ప్రమాద బీమా పథకం కింద 64.35 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక గ్రూపు సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజి ఉంటుంది. ఈ పథకం అమలుకు రూ.96.53 లక్షల ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. స్వయం సహాయ సంఘం సభ్యురాలు ప్రమాదంలో మరణించినట్లైతే రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News