Saturday, November 23, 2024

అగ్రవర్ణ పేదల కోటా జిఒ జారీ

- Advertisement -
- Advertisement -

Orders issued to implement 10 per cent reservation under EWS

 

రాష్ట్రంలో 60శాతానికి చేరుకున్న రిజర్వేషన్లు
జిఒ నం.30 విడుదల, ఇడబ్ల్యుఎస్ కింద 10%
ఆర్యవైశ్యులు, రెడ్డి , వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ,
కమ్మ సామాజిక వర్గాలకు మేలు

మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న చట్టాన్ని తెలంగాణలోనూ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జిఓను తీసుకొచ్చింది. కేంద్ర తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్టు ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్‌లు అమలయ్యేలా సిఎస్ సోమేష్‌కుమా ర్ ఉత్తర్వులను జారీ చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జిఓ 33ను విడుదల చేసింది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్ల ను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఎకనామికల్ బ్యాక్‌వర్డ్ క్లాస్ (ఇడబ్లుఎస్)లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రం లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

ఈడబ్లుఎస్ రిజర్వేషన్లతో కలుపుకొని ఇ కపై 60 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నా యి. గతంలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బిసిలకు 29 మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమ ల్లో ఉన్నాయి. టిఎస్‌పిఎస్సీ చేపట్టే వివిధ రకాల ఉద్యోగ ఖాళీల భర్తీలో ఈ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇంజనీరింగ్, వైద్య, ఇతర విద్యా సంబంధిత సీట్ల భర్తీలోనూ ఇదే పద్ధతిని అధికారులు అనుసరిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోసం విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను ప్రస్తుతం పెంచాల్సిందే. అంటే 110 సీట్లలో 50 ఎస్సీ, ఎస్టీ, బీసీలతో మిగతా 50 సీట్లను ఓపెన్ కాంపిటీషన్‌తో, 10 సీట్లను ఈడబ్ల్యూఎస్‌తో భర్తీ చేయనున్నారు.

విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్లుఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా ఈడబ్లుఎస్ రిజర్వేషన్లను అమలుచేస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. 2019లో జరిపిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహా, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రాష్ట్ర ప్రభుత్వ (మైనారిటీ ఎడ్యుకేషనల్ సంస్థలు మినహా)ల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు కానుంది. ఇక ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని అందుకు సంబంధించిన కొత్తగా రూల్స్, గైడ్ లైన్స్ తయారు చేయమని సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖలకు ఆదేశాలను జారీ చేసింది. గత నెలలో ఈడబ్లుఎస్ అమలుపై సిఎం కెసిఆర్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణాలో ఈడబ్లుఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్‌లలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు ఈ రిజర్వేషన్లను కల్పిస్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఈడబ్లుఎస్ రిజర్వేషన్లు అమలవుతాయి.

రిజర్వేషన్లు.. అర్హతలు ఇవే..

ఈడబ్లుఎస్ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం రూ.8లక్షలలోపు వార్షిక ఆదాయం, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి, వెయ్యి చ.అడుగుల లోపు ఇల్లు ఉన్న వారు, రెసిడెన్షియల్ ప్లాట్ 109 చ.గజాలు, నాన్ మున్సిపాలిటీల్లో 209 చదరపు గజాల్లోపు ఉన్నవారికే ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్లుఎస్ (E.W.S) 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జిఓ జారీ చేయడంపై సిఎం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. సిఎం కెసిఆర్ అపర భగీరథుడులా పాలన కొనసాగిస్తున్నారు. కెసిఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలోని ఆర్యవైశ్యులతో పాటు రెడ్డి సామాజిక వర్గం, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ కులాల్లో ఉన్న పేద విద్యార్థులకు కాలేజీ సీట్లలో, ఉద్యోగాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదలకు మేలు

టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి

ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన సిఎం కెసిఆర్ ఈడబ్లుఎస్‌ను అమల్లోకి తీసుకురావడంతో రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్‌లు లభిస్తాయి. రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వారు సిఎం కెసిఆర్‌కు రుణపడి ఉంటారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలతో పాటు పేదలకు మేలు చేసే వాటినే సిఎం కెసిఆర్ అమల్లోకి తీసుకొస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News