Saturday, September 14, 2024

బెంగళూరులో వివక్ష పద్ధతులను నిషేధిస్తూ ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బిబిఎంపి) శుక్రవారం వాణిజ్య సముదాయాలలో వివిక్ష వైఖరిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల బెంగళూరులో ఓ తండ్రి, కొడుకు కలిసి సినిమా చూడ్డానికి వస్తే అక్కడి థియేటర్ వాళ్లు ధోతి కట్టుకొచ్చాడని వయసుడిగిన తండ్రిని లోనికి అనుమతించలేదు. అది పెద్ద వివాదం అయింది. దాంతో వివిక్ష విధానాలను కట్టడి చేస్తూ బిబిఎంపి ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివ కుమార్ ఇటీవల సంప్రదాయ డ్రెస్ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు బిబిఎంపి భాష, కులం, జాతి, మతం, దుస్తులు, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివిక్షపూరిత వైఖరిని నిషేధిస్తూ మార్గదర్శక ఆదేశాలను జారీచేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News