- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ అర్హత వయస్సు 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలకు వయోపరిమితి సడలిస్తామని సిఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగాలకు వయోపరిమితిని పదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం కలగనుంది.
- Advertisement -