Friday, November 22, 2024

ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ

- Advertisement -
- Advertisement -

Orders were issued to take over IPS officer Abhishek Mohanty

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ చేసినట్లు ఎజి హైకోర్టులో నివేదించారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. దీంతో ఎపికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు. అన్ని వాదనలు విన్న క్యాట్ మొహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులిచ్చింది.

అయితే ఎపి ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో మొహంతి ట్రైబ్యునల్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో సిఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మార్చి 15 వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. క్యాట్ విచారణ నిలిపివేయాలని సోమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతి విధుల్లోకి తీసుకుంటూ జివొ జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలపడంతో సిఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News