Tuesday, February 25, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటం

- Advertisement -
- Advertisement -

ముంబయి : మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉద యం 10 గంటల శక్తిమంతమైన విస్ఫో టం సంభవించింది. కనీసం 8మంది ప్రా ణాలు కోల్పోగా ఏడుగురు గా యపడిన ట్లు కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫ్యాక్టరీ ఎల్‌టిపి సెక్షన్‌లో పేలుడు సంభవించింది. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు సాగుతోంది. పేలుడు తరువాత ఒక యూనిట్ పైకప్పు కుప్పకూలినప్పుడు కనీసం 14 మంది కార్మికులు ఉన్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేశారు. దుర్ఘటన సమయంలో ఆ విభాగంలో 13 మంది నుంచి 14 మంది పని చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సంజయ్ కొల్టె తెలిపారు.

ఆరుగురు వ్యక్తులను వెలుపలికి తీసుకువచ్చారని, వారిలో ఒకరు మరణించారని, ఇతరులకు ఒక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని ఆయన తెలిపారు. ఇంత వరకు కనీసం ఇద్దరు వ్యక్తులను రక్షించినట్లు జిల్లా అధికారులు తెలియజేశారు. ‘భందారా జవహర్ నగర్ ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీలో విస్ఫోటం అనంతరం అగ్నిమాపక శకటాలను. అంబులెన్స్‌లను పంపించారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు ప్రస్తుతం సాగుతున్నాయి. ఒక పైకప్పు కూలిపోయింది. దానిని జెసిబి సాయంతో తొలగిస్తున్నారు’ అని జిల్లా అధికారి ఒకరు ‘ఎఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. పలు అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలను ఆ ప్రదేశానికి హుటాహుటిని తరలించడమైంది. అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీస్ అధికారులు, ల్యాండ్ రెవెన్యూ అధికారి, ఇతర పాలనయంత్రాంగం అధికారులు పేలుడు ప్రదేశానికి చేరుకున్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్)ను కూడా పంపారు.ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News