Thursday, November 14, 2024

ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రేమ పేరుతో మోసం చేసి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ ఓ రాజకీయ పార్టీలో సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేస్తున్న యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎసిపి దేవారెడ్డి త్రీటౌన్ సిఐ బానుప్రకాశ్ తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని త్రీటౌన్ సిఐ తమ సిబ్బందితో కలిసి కేసును దర్యాప్తు చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వ్యక్తిపై ఆత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

సంవత్సరం క్రితం అతను తన సమీప గ్రామానికి చెందిన ఓ యువతిని ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని రోజు ఫోన్లు, మెసెజ్, వీడియో కాల్స్ చేస్తూ ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె అతనితో ప్రేమలో పడింది. కొద్ది రోజుల క్రితం బాధితురాలు తన అక్క వద్దకు వెలుతుండగా తానే దింపి వస్తానని కారులో ఎక్కించుకొని శ్రీనివాస్ ఆమెతో బలవంతంగా శారీరకంగా కలిశాడు. అలా రెండు మూడు సార్లు కలిసిన శ్రీనివాస్ ఆమె వివాహాం చేసుకోమని కోరగా చేసుకోనని చెప్పడంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎసిపి తెలిపారు. నిందితునిపై 376,420 సెక్షన్ల కింద త్రీటౌన్ సిఐ బాను ప్రకాశ్ కేసు నమోదు చేసి ఆరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News