Wednesday, January 22, 2025

సేంద్రీయం కొత్త పుంతల్..

- Advertisement -
- Advertisement -

నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో పాటు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని గ్రహిస్తున్నారు. స్వయంగా తయారు చేసుకున్న ఎరువులు వాడుతూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి లాభాలను గడిస్తున్నారు.సొంత ఆలోచనలతో పాటు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు. ఇదే కోవలోకి వస్తారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఒబులాపూర్ ఆమ్లేట్ వీలేజ్ శంకరాయకుంటకు చెందిన రైతు మాకు మహేశ్.
భిన్నమైన ఆలోచనతో ముందడుగు: సాధారణంగా మెజార్టీ రైతులందరూ మూస పద్ధతితో పంటలు సాగు చేస్తారు. వేసిన పంటలనే మళ్లీ మళ్లీ వేస్తుంటారు. దీంతో దిగుబడులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతులు మృతి చెందడంతో బాధిత రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మనం చెప్పుకోబోయే రైతు మాకు మహేశ్ వీటిన్నింటికీ చెక్ పెట్టాలని ప్రతీనిత్యం మదనపడుతుండేవాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన (ఎమ్మెస్సీ కెమెస్ట్రీ) మాకు మహేశ్ ప్రవృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. రైతులు మూస పద్ధతితో కాకుండా భిన్నంగా ఆలోచించి వారితో వ్యవసాయం చేయించాలని ఆలోచిస్తుండేవాడు. రైతుల ఆత్మహత్యలను నివారించి వారిని లాభాల వైపునకు గట్టేక్కించాలని , ఇందుకు తన వంతుగా సాయం చేయాలని పరితపిస్తుండేవాడు. భిన్నమైన వ్యవసాయం చేయాలని రోజు వ్యవసాయానికి సంబంధించిన పలు యూట్యూబ్ ఛానళ్లను చూస్తూ ఉండేవాడు. అలా చూస్తుండగా ఒకరోజు అధిక దిగుబడులు ఇచ్చే కాలాబట్టి, నవారా వంటి వరి పంటల గురించి తెలుసుకున్నారు. వెంటనే పంటలకు సంబంధించిన విత్తనాలు నల్గొండకు వెళ్లి తీసుకొచ్చి సాగుకు శ్రీకారం చూట్టాడు. నాణ్యమైన ది గుబడులతో పాటు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పలువురు రైతులకు ఆదర్శంగా ని లుస్తున్నాడు. తన అనుభవాన్ని ఇతర రైతులకు చెబుతూ వారిని కూడా లాభాల బాటలో నడిపిస్తున్నాడు. రైతులతో పాటు పలువురి ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతున్నాడు.
సొంతంగా జీవామృతం తయారీ: ప్రస్తుతం ఎటువంటి పంటలు పండించాలన్న ప్రతీరైతు రసాయనికి ఎరువులకే మొగ్గుచూపుతున్నాడు. దీంతో పెట్టుబడుల ఖర్చు తడిసిమోపడవుతున్నాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో తానే సొంతంగా ఎరువులను తయారు చేసుకున్నాడు. ఆర్గానిక్ ఐఎంసీ వంటి సహాజ ఉత్పత్తులను వాడుతూ పంటలను సాగుచేస్తున్నాడు. ప్లాస్టిక్ డ్రమ్ము, సిమెంట్ తొట్టిలో 200 లీటర్ల నీళ్లు పోసి అందులో 2కిలోల బెల్లం కలుపాలి. 30 మి.లీ సీసాలో ఉండే వేస్ట్ డీకంపోజర్ పోడిని చేతితో తాకకుండా డ్రమ్ములో వేయాలి. ఉదయం, సాయంత్రం కర్ర సాయంతో కలియతిప్పాలి. సరిగ్గా వారం రోజుల్లో కోట్లాది సూక్ష్మజీవులు ఉద్భవిస్తాయి.ఇలా తయారైన ద్రావణం లేత ఎరుపు రంగులోకి మారుతుంది. దానిపై తెల్లని అట్టులా తెట్టు తయారవుతుంది. 5 నుంచి 7 రోజుల్లో ఘాటనై పులిసిన వస్తే ‘వేస్ట్ డీకంపోజర్’ ద్రావణం తయారైనట్టే. డ్రమ్మును, తొట్టిని నీడలోనే ఉంచాలి.
డీకంపోజర్ పునరుత్పత్తి: 200 లీటర్ల ద్రావణంలో 190 లీటర్ల ద్రావణాన్ని చక్కగా పంటలకు ఉపయోగించుకోవాలి.10 లీటర్ల ద్రావణంలో మళ్లీ 190 లీటర్ల నీరు, 2కిలోల బెల్లం వేసి క లియతిప్పితే 5 నుంచి 7 రోజుల్లో ద్రావణం తయారువుతుంది. ఇందులోంచి సాటి రైతులకు 5 లీటర్ల ద్రావణం ఇస్తే వారు కూడా ద్రావణం త యారుచేసుకోవచ్చు. వరి, చెరుకు మొదలగు పంటలు కోసిన తరువాత మిగిలిన వ్యర్థాలను కాల్చకుండా వాటిని ఎరువుగా మార్చుకునేందుకు డీకంపోజర్ సాయపడుతుంది. దాదాపు టన్ను పంట వ్యర్థాలపై 100 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేస్తే 40 రోజుల్లో మంచి ఎరువుగా మారుతుంది.
సాగు… భేష్ : కాలాబాట్టి, నవారా రకం వరి పంటల తెగుళ్లకు తట్టుకోవడంతో పాటు ఈదురుగాలులకు నేలకు ఒరిగిపోయే గుణం చాలా తక్కువగా ఉంటుంది. 4 నుంచి 5 సె.మీ పొడవు పెరుగుతంది. పంటకాలం దాదాపు 5నెలల సమయం పడుతుంది. ఎకరాకు 16 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించొచ్చు. రైతు మహేశ్ కు అన్ని ఖర్చులు పోనూ 80వేల వరకు ఆదాయం మిగిలింది.
తగ్గిన కూలీల ఖర్చు : డ్రమ్ సీడర్ పద్ధతితో కూలీల ఖర్చు పూర్తిగా తగ్గింది. డ్రమ్ సీడర్ యంత్రంతో వరినాట్లు వేస్తున్నారు. దీంతో కూలీల ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరైన సమయానికి నాట్లు వేసుకోవచ్చు. సరైన టైముకు నాట్లు వేయడంతో పంట సరైన సమయానికి చేతికందుతుంది. చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో పలువురు రైతులు డ్రమ్ సీడర్ పద్ధతితో వరినాట్లు వేశారు. నారాయణరావుపేట మండలకేంద్రంలో వేసిన కాలాబాట్టి, నవారా వరిపంటలు ఏపుగా పెరగడం ‘మన తెలంగాణ’ పరిశీలనలో తేలింది.
ఎర్ర వరి నవారా లాభాలు
-పీచు పదార్థాం అధికంగా ఉంటుంది.
-కీళ్ల నోప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
-బరువును అదుపులో ఉంచుతుంది.
– పిల్లల పెరుగుదలకు సహయపడుతుంది.
-డయాబెటీస్ ను అదుపులో ఉంచుతుంది.
బ్లాక్ రైస్ కాలాబాట్టి ఉపయోగాలు
మానవునిలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. దీనిలో ఈ, కె విటమిన్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా నల్లబియ్యం ఉపయోగపడుతాయి. డిఎన్‌ఎ కణాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. అంటోసైనిన్ అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల బియ్యం నలుపు రంగులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చైనాకు చెందిన క్యాన్సర్ నిపుణులు లీపింగ్‌లియో జరిపిన పరి శోధనలో క్యాన్సర్ నిరోధక పదార్థలు తక్కువగా ఉన్నాయని తేలింది. బియ్యం గంజి తల వెంట్రుకలకు పట్టిస్తే అందంగా, ధృడంగా ఉంటాయి. ముఖానికి మాస్క్‌గా రోజు వేసుకుంటే మచ్చలు, మొటిమలు, తగ్గుతాయి. నల్లబియ్యం కంటి వ్యాధులను నయం చేస్తాయి.
బ్లాక్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి : మొదటగా ఓ గిన్నెను తీసుకుని ఒక గ్లాసు బియ్యానికి కొద్దిపాటి నీటితో రెండుసార్లు కడగాలి. కడిగిన బియ్యానికి మూడు గ్లాసుల నీరు పోసి దాదాపు 6 గంటలు నానాబెట్టాలి. నానబెట్టిన నీటితో గిన్నెను మంటపై పెట్టాలి. 20 నిమిషాలలో బ్లాక్ రైస్ తయారవుతుంది. ఇలా తయారైన అన్నానికి ద్రవ రూపంలో ఉన్న కూరను, పెరుగును ఎంచుకోవాలి. మరిన్ని వివరాలకు రైతు మహేశ్ 9959648675 ను సంప్రదించొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News