Wednesday, January 22, 2025

‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా..

- Advertisement -
- Advertisement -

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి రామజోగయ్యశాస్త్రి రచించగా, రేవంత్‌ ఆలపించిన సెకండ్‌ లిరికల్‌ ‘‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’’ సాంగ్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. సి. కల్యాణ్‌ తనయుడు వరుణ్‌కుమార్‌ అతిథులకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్టేజ్‌ మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్‌బస్టర్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విచ్చేసి లిరికల్‌ను లాంచ్‌ చేశారు. ఈ సాంగ్‌ ‘సరిగమలు’ ద్వారా అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ…
కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్‌. ఆయన సినిమాలను నేను నెల్లూరులో చదువుకునే రోజుల్లో రిపీట్‌గా చూసేవాడిని. మా కాలేజీ పక్కనే కృష్ణ, కావేరి, కళ్యాణి థియేటర్స్‌ ఉండేవి. అందులో ఓ వైపు కృష్ణారెడ్డి గారి సినిమా, మరోవైపు ఈవీవీ గారి సినిమాలో పోటా పోటీగా ఆడుతుండేవి. అప్పుడు వీళ్లిద్దరూ స్టార్‌ డైరెక్టర్‌లు. వీళ్లు చూడని హిట్‌లులేవు.. బ్లాక్‌బస్టర్‌లు కూడా లేవు. దర్శకుల పేరు చూసిన సినిమాకు వెళ్లే ట్రెండ్‌ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డి గారు కూడా ఒకరు. సెన్సార్‌ నుంచి ఇన్ని సినిమాలకు క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందిన ఏకైక దర్శకులు కృష్ణారెడ్డి గారే.

మా బాలయ్య బాబుతో చేసిన ‘టాప్‌హీరో’ సినిమా పాటల కోసం ఆడియో క్యాసెట్స్‌ అమ్మే షాపుకు సైకిల్‌ మీద వెళ్లి, గంటల తరబడి ఎదురు చూసి మరీ కొన్న విషయం ఎప్పటికీ మర్చిపోలేను. దర్శకత్వం అంటేనే చాలా టెన్షన్‌తో కూడిన క్రియేటివ్‌ వర్క్‌.. అంత టెన్షన్‌తో పాటు మళ్లీ సంగీతం బాధ్యతలు అది కూడా తన ప్రతి సినిమాకూ తానే సంగీతం అందించడం ఒక్క కృష్ణారెడ్డి గారికే చెల్లింది. కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల మాదరిగానే నేను కూడా ఈ ఆర్గానిక్‌ మామ`హైటెక్‌ అల్లుడు కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా. ఇక సి. కల్యాణ్‌ గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు అత్యంత ఆప్తులు. నా కెరీర్‌ బిగెనింగ్‌ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తి. కోనేరు కల్పన గారు ఈ సినిమాతో పెద్ద హిట్‌ కొట్టబోతున్నారు అన్నారు.

నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ..
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను పిలవగానే ముఖ్యఅతిథిగా విచ్చేసిన మా బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు. ‘క్రాక్‌’ సినిమా మా కాంబినేషన్‌లో బాలయ్య బాబు హీరోగా చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల మిస్‌ అయ్యింది. ఆ హిట్‌ నాకు దక్కక పోయినా.. మా గోపీ ఖాతాలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డిగారు ఈ సినిమాతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినట్టే. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. అచ్చిరెడ్డి గారు ప్రతిక్షణం ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తూ వచ్చారు.

మా కల్పనకు సూపర్‌హిట్‌ ఇవ్వటానికి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ అహర్నిశలూ యూనిట్‌ అంతా శ్రమించారు. కృష్ణారెడ్డి గారు ఈ సినిమాతో మళ్లీ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చి సంవత్సరానికి ఒక సినిమా చేస్తారని నేను భావిస్తున్నాను. మీన గారు భర్త పోయిన విషాధంలో ఉన్నప్పటికీ కొద్ది రోజుల వ్యవధిలోనే మా షూటింగ్‌కు హాజరవ్వడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్‌గారు మళ్లీ ఇరగదీసేశారు. సోహల్‌ కూడా మంచి ఫైర్‌ ఉన్న ఆర్టిస్ట్‌. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా అన్నారు.

ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ…
సంక్రాంతికి హిట్‌ సినిమా పడితే ఆ సంవత్సరం అంతా సినిమా పరిశ్రమ కళకళలాడుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతికి రెండు సూపర్‌హిట్‌లు పడ్డాయి. అందులో వీరసింహారెడ్డి దర్శకుడిగా గోపీచంద్‌ గారికి రావడం హ్యాపీగా ఉంది. కృష్ణారెడ్డి గారికి సినిమా చేయడానికి గ్యాప్‌ వచ్చినప్పటికీ ఆయనలోని దర్శకుడిలో క్రియేటివిటీకి అగ్నిపర్వతాలు ఎప్పుడూ బ్రద్ధలవుతూనే ఉంటాయి. కృష్ణారెడ్డిగారి రెగ్యులర్‌ స్టైల్లో ఉంటూనే నేటి యంగర్‌ జనరేషన్‌ను ఆకర్షించే అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కింది.

సి. కల్యాణ్‌ గారి ఆశీస్సులు, నిర్మాణంలో కోనేరు కల్పన గారు తీసుకున్న శ్రద్ధ ఈ సినిమాను పెద్ద హిట్‌ చేస్తాయి. కృష్ణారెడ్డిగారి సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక మెసేజ్‌ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ప్రస్తుత యంగర్‌ జనరేషన్‌ యూత్‌కు మంచి మెసేజ్‌ ఉంది. ఈ సినిమా చూసే యువతకు ఒక గోల్‌ ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ పాటను ప్రత్యేకంగా రాయించారు. ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో ‘సంతోషం’ సురేష్‌ గారు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. మార్చిలో థియేటర్స్‌లోకి రానున్న ఈ సినిమా కచ్చితంగా హిట్‌ సినిమా అవుతుంది అన్నారు.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…
ఈ సినిమాకు పనిచేసిన అందరూ మహానుభావులుగానే చెప్పుకోవాలి. ఇటీవలే ఈ సినిమాను చూసిన కళ్యాణ్‌ గారు ఎంత ముచ్చటపడ్డారో.. అది చూసి నేను ఇంత మంచి సినిమా చేశానా అన్న భావన నాకు కలిగింది. ఇంతకు మించి నాకు ఏం కావాలి. ఈ సినిమా పంచవర్ణాల్లో వెండితెరపై వెలిగిపోవటానికి కెమెరామెన్‌ సి. రాంప్రసాద్‌ పెట్టిన ఎఫర్ట్స్‌ ఎప్పటికీ మరువలేను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి లెవల్‌బెస్ట్‌గా పనిచేశారు.

ఇక రాజేంద్రప్రసాద్‌గారి గురించి కోటి మాటలు చెప్పినా తక్కువే. ఇక మీనా గారి నటన అద్భుతం. మిగిలిన నటీనటులు పోటీ పడి మరీ చేశారు. ఇది హిలేరియస్‌ కామెడీ, ఫ్యామిలీ, యూత్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మార్చి నెలలో ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఈ సినిమాకు తొలిసారిగా డైలాగ్స్‌ కూడా రాశాను. అదనుగా, పదునుగా ఉంటాయి. నా నుంచి ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేసే వల్టారిటీ లేని సినిమా ఇది. నాకు ఈ అవకాశం కల్పించిన నిర్మాత కల్పన గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆమె ఈ సినిమా కోసం చేసిన కృషి మార్వలెస్‌. తప్పకుండా మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
మలినేని గోపీచంద్‌ గారి చేతుల మీదుగా ఈ సెకండ్‌ రిలికల్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి గారి మార్క్‌ సినిమా అంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకటే.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేయటమే ఆయన లక్ష్యం. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. నిర్మాత కల్పన గారు చేస్తున్న తొలి స్ట్రెయిట్‌ సినిమా. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చక్కని ట్రీట్‌ ఇవ్వబోతున్నారు కృష్ణారెడ్డిగారు అన్నారు.

సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News