Wednesday, January 22, 2025

మార్చి 3న ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’

- Advertisement -
- Advertisement -

ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్ “ఎస్వీ కృష్ణారెడ్డి”, తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.  ఇక ఈ మూవీలోని ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం.

Organic Mama Hybrid Alludu will release on March 3సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News