Saturday, November 23, 2024

నూతన ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఆగస్టు 26, 27 తేదిలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదిల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 27,28 శని, ఆదివారం రోజున జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు సంబంధిత పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓటరు జాబితా పట్టుకుని ఉంటారన్నారు.

అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు గల యువతి యువకులు, ఓటర్లందరు ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని, ఒకవేళ తన పేరు ఓటరు జాబితాలో లేకున్న, లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలనుకున్న అక్కడే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర సంబంధిత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1వ తేది నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు లేదా ఇప్పటికే 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు ఓటరు జాబితాలో తమ పేరును ఫారం 6 ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.

ట్రాన్స్‌జెండర్‌లు, దివ్యాంగులు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటు కలిగి ఉన్న వారు సైతం మరోసారి తమ పేరును జాబితాలో పరిశీలించుకోవాలని, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఫారం 7 లేదా 8 ద్వారా సరి చేసుకోవచ్చని తెలిపారు. మార్పులు, చేర్పులు సవరణలు ఉంటే ఫారం 8లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజులతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో మరో రెండు రోజుల పాటు ఇదే తరహా ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News