Wednesday, January 22, 2025

బూస్టర్ డోసు క్యాంప్‌లు నిర్వహించండి

- Advertisement -
- Advertisement -

Organize booster dose camps: Union Health Ministry

రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17శాతంమంది మాత్రమే బూస్టర్‌డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్రాలు బూస్టర్ డోసు క్యాంపుల నిర్వహణపై చొరవ చూపాలని కోరారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అందుబాటులో ఉన్న ప్రికాషన్ డోసు కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, సూళ్లు, కాలేజీలు, ప్రార్థన స్థలాలు, పుణ్యక్షేత్రాల మార్గాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అర్హులందరూ ప్రికాషన్ డోసు డోసు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

64,89,99,721 మంది లక్ష్యిత జనాభాలో జులై 14వరకు కేవలం 8శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. జులై 15నుంచి ప్రభుత్వం 75రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని 18ఏళ్లకుపైబడిన అందరికీ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. 74.5కోట్లమంది అర్హులుంటే ఆగస్టు 15నాటికి కేవలం 17శాతంమంది 12,36,03,060 కొవిడ్ 19ప్రికాషన్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారని కేంద్రమంత్రి మాండవీయ వివరించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..అర్హులైన జనాభా బూస్టర్ డోసు తీసుకునేలా కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ ఒక్కడోసు కూడా ఎక్స్‌పైరీ అవకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి మాండవీయ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News