Saturday, December 21, 2024

కెబిఆర్ ఫంక్షన్ హాల్‌లో బిసిల ప్లీనరీ సమావేశం ఏర్పాటు పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : బిసిలు రాజకీయంగా తరతరాలుగా అన్యాయానికి గురైతున్నారని బిసి జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ కెబిఆర్ ఫంక్షన్ హల్‌లో శనివారం జరిగే బిసిల ప్లీనరీ సమావేశం ఏర్పాట్లు శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందరంగా ఆయన మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించడానికి ఈ ప్లీనరీ ఎంతగానే ఉపయోగపడుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలు అనుసరించాల్సిన ఫ్యూహం, ప్లీనరీలో సుదీర్ఘ చర్చ జరుపుతామని సృష్టం చేశారు.

జనాభాలో అరశాతం, ఒక శాతం , ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలు నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని 60 శాతానికి పైగా ఉన్న బిసిలకు రాజ్యాధికారం దక్కించుకోవడామే అంతిమ లక్షం అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దుర్గయ్య గౌడ్ ,బిసి కులాల జేఎసి ఛైర్మన్ గణేష్ చారి , రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీనివాస్ , బిసి యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యామ్ కురమ , నగేష్ , నర్సింహ్మ , నర్సింహ్మనాయక్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News