Monday, January 20, 2025

అనాథ బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నిందితుడిపై పోక్సో కేసు
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ అనాథ బాలికపై జిల్లా లీగల్ సర్వీసెస్‌కు చెందిన అటెండర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉ న్నాయి.. ఈ నెల 14న బాలసదన్‌లో నిర్వహించి న కార్యక్రమానికి డిసిపిఒతో పాటు మరికొందరు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి నిందితుడు కూడా రాగా.. ఒక బాలిక రూమ్‌లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచారానికి పా ల్పడ్డాడు.

బాలిక ఏడుస్తూ వచ్చి విషయాన్ని బాలసదన్ సిబ్బందికి చెప్పింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా.. విషయం బయటకు వస్తే అందరి ఉద్యోగాలు పోతాయంటూ ఓ అధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గోప్యం గా ఉంచేందుకు బాధితురాలిని భువనగిరి బాలసదన్ నుంచి వలిగొండలోని ఒక ప్రైవేటు అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు. అనంతరం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు రావడంతో భువనగిరి పట్టణ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News