Wednesday, January 22, 2025

ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నిర్మాణాలు జరుగుతున్న ప్రాజెక్టులను పరిశీలించిన జలమండలి ఎండి

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఓఆర్‌ఆర్-2 ప్రాజెక్టుల నిర్మాణంలో చివరి దశకు చేరుకున్న రిజర్వాయర్లను వీలైనంత తొందరగా పూర్తి చేసి వేసవి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓఆర్ ఆర్ ప్రాజెక్టు – 2, ప్యాకేజీ – 2 లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని కిస్మత్ పూర్, మంచిరేవుల, భైరాగి గూడ, గంధం గూడ, బృందావన్ కాలనీ, ఎర్రకుంట అభ్యుదయ నగర్, గండిపేట్ లలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు రిజర్వాయర్లను సందర్శించారు.

రిజర్వాయర్లలో ఇన్ లెట్, అవుట్ లెట్ లు పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను, కొత్తి రిజర్వాయర్లతో లబ్ది జరిగే ప్రాంతాల వివరాలను ఆరా తీశారు. మిగిలిపోయిన డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఇతర పనులను పూర్తి చేసి ఈ వేసవిలో వంద శాతం నీరు సరఫరా అందించే లాగా పనులను వేగవంతం చేయాలని సూచించారు. నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రిజర్వాయర్లపై రిజర్వాయర్ వివరాలతో కూడిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రిజర్వాయర్లు ఒకే శైలిలో ఈ బోర్డులు ఉండాలని సూచించారు. అలాగే నీరు పొదుపు చేసి.. వృథాను అరికట్టే విధానాల గురించి రిజర్వాయర్లపై నినాదాలు రాయించాలన్నారు. అనంతరం ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని సందర్శించి రిజర్వాయర్ గేట్లను పరిశీలించి నీటి స్థాయి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మాన్ సాగర్ సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లి జలాశయ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నీటి మట్టాల లాగ్ బుక్‌ను పరిశీలించారు. వందేళ్ల చరిత్ర కలిగి ఈ బుక్ ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్/ప్రాజెక్టు డైరెక్టర్ – 2 రవికుమార్, సీజీఎం టీవీ శ్రీధర్, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News