ఆ సమయంలో వైద్యుల సలహాలు తప్పనిసరి
ఎక్కువ సమయం నడక, వ్యాయామం ప్రమాదకరం
వైద్యులచే పరీక్షలు చేయించుకుని పాదయాత్రలు చేపట్టాలి
గైనీగల్స్, గ్లోబల్ ఆసుపత్రి స్పోర్ట్ వైద్యులు డా.కొల్లా సాకేత్ వెల్లడి
మన తెలంగాణ,సిటీబ్యూరో: శారీరకంగా చురుగా ఉండటం చాలా మంచి అలవాటు రోజు నడవడం మంచి ఆరోగ్యానికి సులువైన మార్గమని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఎక్కువ నడక మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఎక్కువ దూరం నడిచే ముందు, శారీరక వ్యాయామం చేసే ముందు అంటే ఎక్కువ దూరం మారథాన్ నడక, పాదయాత్రలు చేసేటప్పడు ముందు జాగ్రత్తలతో పాటు నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలని ముఖ్యమని సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు, ఇతర సమయాల్లో రాజకీయ నాయకులు సుదీర్ఘ పాదయాత్రలు ప్రారంభిస్తారు. దీంతో ఎక్కువ ప్రాంతాన్ని కాలినడక కవర్ చేయడానికి వీలైతుంది. ఇది ఒకసారి కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. ఇలాంటి పాదయాత్రలు ప్రారంభించే ముందే కొందరు నాయకులు తమ శరీరక సామర్దం సరిచూసుకుంటారు. కానీ వాళ్ల అనుచరులు మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెంట వెళ్లుతారు. అలా సిద్దం కాకపోతే వారి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చివరకు పాక్షికంగా, శాశ్వతంగా కూడా నష్టం జరిగే పరిస్దితి కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా పాదయాత్రలు చేయాలనుకునేవారికి గ్లోబల్ ఆసుపత్రిలో సింగపూర్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన డా. కొల్లా సాకేత్ పలు సూచనలు చేస్తున్నారు.
పాదయాత్రల ద్వారా ఆర్థోపెడిక్ సమస్యలు: మోకాళ్ల నొప్పులు, మృదులాస్ది అరిగిపోవడం, లిగమెంట్ గాయం, కాళ్లు, మడమ, పాదం, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, పాదాల్లో ఒత్తిడి వల్ల ప్రాక్చర్లు , నడుం నొప్పి, పాత గాయాలు తిరగబెట్టడుతాయి. పాదయాత్ర సమయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థోపెడిక్ గాయాలను నివారించవచ్చని,