Thursday, January 23, 2025

ఓరుగల్లు కీర్తి కిరటం పీవీ నర్సింహారావు

- Advertisement -
- Advertisement -

వరంగల్ బ్యూరో : ఓరుగల్లు కీర్తి కిరిటం పీవీ నర్సింహారావు అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజు యాదవ్ అన్నారు. బుధవారం పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా హనుమకొండ బస్టాండ్ వద్ద ఉన్న పీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుందర్‌రాజు యాదవ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విశేషమైన కృషి చేసిన ఆర్థికవేత్త పీవీ నర్సింహారావు అని చెప్పారు. దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు పీవీ నర్సింహారావు అని అన్నారు.

నేటి భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు నాడు పీవీ వేసిన వేనని గుర్తు చేశారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా బహుబాషా వేత్తగా, సాహితీవేత్తగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞశాలి పీవి నర్సింహారావు అని కొనియాడారు. పీవీ శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. తెలంగాణ బిడ్డగా, శాసనసభ్యుడి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మన బిడ్డ పీవీ నర్సింహారావు అని చెప్పారు. సాంకేతికత, సంస్కరణలు, సామాజిక అంశాలతో పాటు విదేశాంగ విధానం, పరిశోధనలు, దేశ భద్రత, అణు పరిశోధన పలు రంగాల్లో పీవీ తనదైన ముద్ర వేశారని చెప్పారు.

పీవీ జన్మించిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తెలంగాణ ప్రభుత్వం తీర్చదిద్దుతోందని అన్నారు. అంతే కాకుండా నెక్లెస్ రోడ్డు పేరును పీవీ మార్గ్‌గా తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్ఛిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, హరిరమాదేవి, ఏకశిల సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News