Monday, January 20, 2025

మేడ్చల్ బిసివై పార్టీ అభ్యర్థిగా ఓరుగంటి వెంకటేశ్వర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ఓరుగంటి వెంకటేశ్వర్లును భారత చైతన్య యువజన(బిసివై) పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రాంచంద్ర యాదవ్ ప్రకటించారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓరుగంటి వెంకటేశ్వర్లును మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఆయనను పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ అభినందించారు. అసెంబ్లీలో బిసి గళాన్ని వినిపిస్తానని మేడ్చల్ నియోజకవర్గం ప్రజలంతా చెరుకు రైతు గుర్తు పై ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News